టీఎంసీ ఎంపీ తల నరికితే కోటి రూపాయలు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
- సాయోని ఘోష్ తల నరికితే రూ. కోటి ఇస్తానన్న బీజేపీ నేత
- ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ప్రదీప్ దీక్షిత్ వీడియో వైరల్
- శివలింగంపై పాత పోస్టు వివాదమే ఈ బెదిరింపులకు కారణం
- ఇదేనా నారీశక్తి వందన్ అంటూ ప్రధానిని ప్రశ్నించిన సాయోని ఘోష్
- ఆ వీడియో ఏఐ మానిప్యులేటెడ్ అంటూ ఖండించిన బీజేపీ నేత
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ ఎంపీ సాయోని ఘోష్ తల నరికి తెచ్చినవారికి కోటి రూపాయల బహుమతి ఇస్తానంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. యూపీలోని బులంద్‌షహర్ జిల్లా సికంద్రాబాద్ బీజేపీ మున్సిపల్ ఛైర్మన్ ప్రదీప్ దీక్షిత్ ఈ ప్రకటన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ బెదిరింపు వీడియోపై ఎంపీ సాయోని ఘోష్ 'ఎక్స్' వేదికగా తీవ్రంగా స్పందించారు. "నా తల నరికితే రూ. కోటి రివార్డు ఇస్తామని బహిరంగంగా ప్రకటించడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ట్యాగ్ చేస్తూ.. "కొత్త భారత్‌లో ఇదేనా నారీశక్తి వందన్?" అని మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశించి ప్రభుత్వాన్ని నిలదీశారు.
సాయోని ఘోష్ 2015లో శివలింగంపై చేసిన ఒక పాత సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి ఈ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ పోస్టు హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే, తన ఖాతా హ్యాక్ అయిందని, విషయం తెలిసిన వెంటనే ఆ పోస్టును తొలగించానని సాయోని గతంలోనే వివరణ ఇచ్చారు. ఈ పాత వివాదంపై ఆదివారం సికంద్రాబాద్‌లో నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రదీప్ దీక్షిత్ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మహిళల భద్రతను బీజేపీ పెద్ద అంశంగా చేసిందని, కానీ ఇప్పుడు అదే పార్టీ నేత ఒక మహిళా ఎంపీని బహిరంగంగా బెదిరిస్తున్నారని సాయోని మండిపడ్డారు. ఈ ఘటనపై యూపీ, కోల్‌కతా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అయితే, బీజేపీ నేత ప్రదీప్ దీక్షిత్ ఈ ఆరోపణలను ఖండించారు. వైరల్ అవుతున్న వీడియో ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసిందని, తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.